e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News Tokyo Olympics: ఒలింపిక్స్ ప్రిక్వార్ట‌ర్స్‌లో పీవీ సింధు

Tokyo Olympics: ఒలింపిక్స్ ప్రిక్వార్ట‌ర్స్‌లో పీవీ సింధు

టోక్యో: ఇండియ‌న్ ఏస్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఒలింపిక్స్ ప్రిక్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. బుధ‌వారం జ‌రిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్‌లోనూ ఆమె విజ‌యం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన ఎన్‌గ‌న్ యితో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16 తేడాతో వ‌రుస గేమ్స్‌లో గెలిచింది. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకున్న సింధుకు.. రెండో గేమ్‌లో ప్ర‌త్యర్థి నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. 14 పాయింట్ల వ‌ర‌కూ ఇద్ద‌రూ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. అయితే ఆ త‌ర్వాత పుంజుకున్న సింధు.. వ‌రుస‌గా పాయింట్లు సాధించింది. సింధు తొలి మ్యాచ్‌లోనూ గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో గ్రూప్ జే టాప‌ర్‌గా ప్రిక్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana