ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Jan 22, 2021 , 00:39:07

క్వార్టర్స్‌లో సింధు, సమీర్‌

క్వార్టర్స్‌లో సింధు, సమీర్‌

  • డబుల్స్‌లో సాత్విక్‌ ముందంజ - థాయ్‌లాండ్‌ ఓపెన్‌ 

బ్యాంకాక్‌: టొయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, సమీర్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధు 21-10, 21-12 తేడాతో సెల్వదురే (మలేషియా)పై 35 నిమిషాల్లోనే గెలిచింది. క్వార్టర్స్‌లో రచనోక్‌ ఇంతనోన్‌తో తెలుగమ్మాయి తలపడనుంది. సమీర్‌ రెండో రౌండ్‌లో 21-12, 21-9తే డాతో ప్రపంచ 17వ ర్యాంకర్‌ రాస్మస్‌ గెమ్కెను చిత్తుచేశాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్‌ 17-21, 18-21తేడాతో లీ డారెన్‌ (మలేషియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ - చిరాగ్‌ శెట్టి మిక్స్‌డబుల్స్‌లో సాత్విక్‌ - అశ్విని పొన్నప్ప జోడీలు ముందడుగేశాయి. 

VIDEOS

logo