శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Feb 20, 2020 , 00:13:37

చెన్నైలో సింధు అకాడమీ

చెన్నైలో సింధు అకాడమీ
  • శంకుస్థాపన చేసిన స్టార్‌ షట్లర్‌

చెన్నై: తన పేరిట చెన్నైలో నిర్మిస్తున్న బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్టేడియానికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు బుధవారం శంకుస్థాపన చేసింది. చెన్నై నగర శివారు కోలప్పాకమ్‌లోని ఓ పాఠశాలలో హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నది. గతంలో హార్ట్‌ఫుల్‌నెస్‌లో సింధు ధ్యాన సాధన చేసింది. ఈ అకాడమీ 18-24 నెలల్లో పూర్తవనుండగా.. ఇందులో మొత్తం ఎనిమిది కోర్టులతో పాటు వెయ్యి మంది కూర్చునే గ్యాలరీ, జిమ్‌ కేంద్రం, యోగా, ధ్యానం చేసుకునేందుకు ప్రత్యేక స్థలం లాంటి సదుపాయాలు ఉంటాయని హార్ట్‌ఫుల్‌నెస్‌ తెలిపింది. ‘ఈ అకాడమీతో దేశ బ్యాడ్మింటన్‌కు ఎంతో ఊతం, ప్రోత్సాహం లభిస్తుంది. ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేందుకే కాకుండా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఈ అకాడమీకి నా పేరు పెట్టడం గౌరవంగా భావిస్తున్నా. హార్ట్‌ఫుల్‌నెస్‌లో ధ్యానం చేయడం వల్ల మానసికంగా మరింత  ప్రశాంతంగా, దృఢంగా తయారయ్యా. మరింత ఎక్కువగా ఏకాగ్రత సాధించగలిగా’ అని సింధు చెప్పింది. 


logo