బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 20, 2020 , 22:10:13

రాహుల్‌, గేల్‌ ఔట్‌..కష్టాల్లో పంజాబ్

రాహుల్‌, గేల్‌ ఔట్‌..కష్టాల్లో పంజాబ్

దుబాయ్:‌  ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ స్వల్ప స్కోరుకే మూడు కీలక  వికెట్లు కోల్పోయింది.  కేఎల్‌ రాహుల్‌(15), క్రిస్‌గేల్‌(29), మయాంక్‌ అగర్వాల్‌(5) వరుస విరామాల్లో పెవిలియన్‌ చేరారు.  తుషార్‌ దేశ్‌పాండే వేసిన ఐదో ఓవర్‌లో గేల్‌ ఒక్కడే మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఇన్నింగ్స్‌కు ఊపుతీసుకొచ్చాడు. ఆ ఓవర్‌లో గేల్‌  వీరవిహారం చేయడంతో 26 పరుగులు వచ్చాయి.

అశ్విన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో భారీ షాట్‌ ఆడబోయిన గేల్‌..బౌల్డ్‌ అయ్యాడు.  మళ్లీ తుషార్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో పూరన్‌ వరుసగా సిక్స్‌, రెండు ఫోర్లు బాది 15 పరుగులు సాధించాడు.  9 ఓవర్లకు పంజాబ్‌ 3వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ 87 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌(25), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(9) క్రీజులో ఉన్నారు.