మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 15:18:34

టీమ్​ఇండియా కిట్ స్పాన్సర్​షిప్ రేసులో పూమా

టీమ్​ఇండియా కిట్ స్పాన్సర్​షిప్ రేసులో పూమా

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా కిట్ స్పాన్సర్​షిప్ రేసులోకి  జర్మనీ ప్రముఖ స్పోర్ట్స్ అపారెల్​, ఫుట్​వేర్​ తయారీ సంస్థ పూమా వచ్చింది. అలాగే ప్రముఖ సంస్థ అడిడాస్ కూడా పోటీకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాగా భారత జట్టు కిట్​ స్పాన్సర్​గా 2016 నుంచి ఉన్న నైకీ ఒప్పందం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో బిడ్లను బీసీసీఐ ఆహ్వానించింది. ఈ మేరకు బిడ్ పత్రాలను పూమా కొనుగోలు చేసింది.

“రూ.లక్ష విలువైన టెండర్ పత్రాలను పూమా కొనుగోలు చేసింది. అయితే బిడ్ డాక్యుమెంట్లను కొంటే బిడ్ వేసినట్టు అర్థం కాదు. కాకపోతే బిడ్​ను వేసేందుకు పూమా అధిక ఆసక్తి కనబరుస్తున్నది” అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. కాగా గత ఐదేండ్లకు కిట్ స్పాన్సర్​గా ఉన్న నైకీ.. బీసీసీఐకు రూ.370కోట్లు చెల్లించింది. అయితే తదుపరి ఐదేండ్లకు ఇంతస్థాయిలో ఎవరూ బిడ్ వేయరని పారిశ్రామిక విశ్లేషకులు అంటున్నారు. కాగా బీసీసీఐ సైతం ఒక్కో మ్యాచ్​కు కిట్ స్పాన్సర్ చెల్లించాల్సిన మొత్తం బేస్ ప్రైజ్​ను రూ.61లక్షల రూపాయలకు తగ్గించి, బిడ్లను ఆహ్వానించింది. ఇది చివరి ఐదేండ్లలో రూ.88లక్షలుగా ఉంది. 


logo