శనివారం 30 మే 2020
Sports - Apr 07, 2020 , 23:33:03

ఈ విరామం ఒక చేదుమాత్ర

ఈ విరామం ఒక చేదుమాత్ర

న్యూఢిల్లీ: ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితులు ఒక చేదు మాత్ర లాంటిదని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు.  తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న వేళ..మనమంతా మనో నిబ్బరంతో వ్యవహరించాలని సూచించాడు. ‘కరోనా వైరస్‌ కారణంగా అందరూ ప్రభావితమవుతున్నారు. ఇది కేవలం క్రీడలకు పరిమితం కాలేదు. ప్రతి ఒక్కరు క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొనే అవకాశముంది. అయినా మనం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి’ అని గోపీ అన్నాడు. 


logo