శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Nov 19, 2020 , 00:36:50

పీఎస్‌ఎల్‌ విజేత కరాచీ కింగ్స్‌

 పీఎస్‌ఎల్‌ విజేత కరాచీ కింగ్స్‌

కరాచీ: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) టైటిల్‌ను కరాచీ కింగ్స్‌ తొలిసారి కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన ఫైనల్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ అజేయ అర్ధశతకం(63నాటౌట్‌) బాదడంతో కరాచీ ఐదు వికెట్ల తేడాతో లాహోర్‌ ఖలందర్స్‌పై గెలిచి టైటిల్‌ ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పో యి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (35), ఫకర్‌ జమాన్‌ (27) మినహా మిగిలిన వారు విఫమయ్యారు. లక్ష్యఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' ఆజమ్‌ అదరగొట్టడంతో 18.4 ఓవర్లలోనే కరాచీ కింగ్స్‌ విజయం సాధించింది. 

డీన్‌ జోన్స్‌కు అంకితం..

గుండెపోటు కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన ఆస్ట్రేలియా దిగ్గజం, తమ జట్టు మాజీ కోచ్‌ డీన్‌ జోన్స్‌కు కరాచీ కింగ్స్‌  టైటిల్‌ను అంకితమిచ్చింది.