బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 13:06:27

మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ మృతి

మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ మృతి

క‌నెక్టిక‌ట్‌: డబ్ల్యూడబ్ల్యూఈ ‌మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ మృతిచెందారు. జేమ్స్ హారిస్ క‌‌మ‌లా పేరుతో గుర్తింపు పొందారు. ఆయ‌న వ‌యో సంబంధిత స‌మ‌స్య‌ల‌తో త‌న 70 ఏండ్ల వ‌య‌స్సులో ఆదివారం సాయంత్రం మ‌ర‌ణించార‌ని వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) ప్ర‌క‌టించింది. ద‌ ఉగాండ‌న్ గెయింట్ లేదా క‌మ‌లా పేరుతో ఆయ‌న సూప‌ర్ స్టార్‌గా ఎదిగార‌ని ట్వీట్ చేసింది. 

ఆఫ్రిక‌న్ మాస్క్, సింహం బొమ్మ‌లు ఉన్న దుస్తులు ధ‌రించి ఆయ‌న పోటీల్లో పొల్గొనేవారు. 1980-90 వ‌ర‌కు ఆయ‌న వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) పోటీల్లో  పాల్గొన్నారు.


logo