గురువారం 16 జూలై 2020
Sports - Apr 25, 2020 , 00:17:42

ప్రొ లీగ్‌ గడువు పొడిగింపు

ప్రొ లీగ్‌ గడువు పొడిగింపు

లుసానే: కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా పోటీలు నిలిచిపోవడంతో  ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌ రెండో సీజన్‌ వచ్చే ఏడాది జూన్‌ వరకు కొనసాగనుంది. ఈ ఏడాది జూన్‌లోనే ముగియాల్సిన సీజన్‌ గడువును సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్‌) శుక్రవారం ప్రకటించింది. ఇందుకు లీగ్‌లో పాల్గొంటున్న 11దేశాల సంఘాలు అంగీకరించాయని తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం ప్రొ లీగ్‌ రెండో సీజన్‌ ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు జరుగాల్సి ఉంది. అయితే మార్చి వరకు మ్యాచ్‌లు సవ్యంగానే సాగి నా.. ఆ తర్వాత కరోనా వైరస్‌ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.


logo