ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 29, 2020 , 08:24:55

పృథ్వీ షా హాఫ్ సెంచ‌రీ.. కోహ్లీ మ‌ళ్లీ విఫ‌లం

పృథ్వీ షా హాఫ్ సెంచ‌రీ..  కోహ్లీ మ‌ళ్లీ విఫ‌లం

హైద‌రాబాద్‌:  న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో భార‌త్ నెమ్మ‌దిగా ఆడుతున్న‌ది.  39 ఓవ‌ర్లు ముగిసే వ‌ర‌కు 4 వికెట్లు కోల్పోయిన భార‌త్ 142 ర‌న్స్ చేసింది.  ఓపెన‌ర్ పృథ్వీ షా 54 ప‌రుగులు చేసి జేమిస‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. మ‌రోసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫ‌లం అయ్యాడు. మూడు పరుగులు చేసిన కోహ్లీ.. టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూ ఔట‌య్యాడు.  కోహ్లీ వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్నాడు.  అంత‌ర్జాతీయ క్రికెట్‌లో గ‌త వ‌రుస అయిదు ఇన్నింగ్స్‌లో.. కోహ్లీ కేవ‌లం 3, 19, 2, 9, 15 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. ఈ మ్యాచ్‌లో ర‌హానే కూడా స్వ‌ల్ప స్కోర్‌కే నిష్క్ర‌మించాడు. పుజారా 40 ప‌రుగుల‌తో క్రీజ్‌లో నిల‌క‌డ‌గా ఆడుతున్నాడు. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకున్న‌ది.  సౌథీ రెండు వికెట్లు తీసుకోగా,  జేమిస‌న్‌, బౌల్ట్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. తొలి టెస్టులో న్యూజిలాండ్ ప‌ది వికెట్ల తేడాతో విక్ట‌రీ సాధించిన విష‌యం తెలిసిందే. 


logo