శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 11, 2020 , 08:43:45

NZvIND:విరాట్‌ కోహ్లీ ఔట్‌.. కష్టాల్లో భారత్‌

NZvIND:విరాట్‌ కోహ్లీ ఔట్‌.. కష్టాల్లో భారత్‌

15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 3 వికెట్లకు 77 పరుగులు చేసింది.

మౌంట్‌ మాంగనీ:  గత రెండు మ్యాచ్‌ల్లో కేవలం 66 పరుగులే చేసిన విరాట్‌ కోహ్లీ ఆఖరిదైన మూడో వన్డేలోనూ కేవలం 9 పరుగులే చేసి నిరాశపరిచాడు. బెనెట్‌ బౌలింగ్‌లో  జేమీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ వెనుదిరిగాడు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(1) పేలవ బ్యాటింగ్‌తో రెండో ఓవర్లోనే పెవిలియన్‌ చేరాడు. మరో యువ ఓపెనర్‌ పృథ్వీ షా(40: 42 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) అనూహ్యంగా రనౌట్‌ కావడంతో భారత్‌ మూడో వికెట్‌ చేజార్చుకుంది. ఆరంభం నుంచి వేగంగా ఆడుతున్న షా.. బెనెట్‌ వేసిన 13వ ఓవర్లో సింగిల్‌ కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కివీస్‌ పేసర్లు భారత్‌ను గట్టి దెబ్బకొట్టడంతో టీమ్‌ఇండియా ఒత్తిడిలో పడింది.  ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌(17), కేఎల్‌ రాహుల్‌(8) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. 


logo