బుధవారం 20 జనవరి 2021
Sports - Dec 18, 2020 , 20:51:16

'పృథ్వీ షాకు ఇక జట్టులో చోటు కష్టమే'

'పృథ్వీ షాకు ఇక జట్టులో చోటు కష్టమే'

ముంబై: ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ పృథ్వీ షా(0, 4) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. పేలవ ప్రదర్శన చేస్తున్న షా ఆస్ట్రేలియాతో మిగతా టెస్టులకు  భారత జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డారు.   తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు బంతులే ఆడిన  పృథ్వీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో బంతులకే పెవిలియన్‌ చేరాడు.

రెండు ఇన్నింగ్స్‌లోనూ  ఒకే విధంగా బౌల్డ్‌ అవడంపై భారత మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.   ఇంగ్లాండ్‌  మాజీ ఓపెనర్ నిక్ నైట్ మాట్లాడుతూ.. తుది జట్టు నుంచి పృథ్వీ షా తప్పుకుంటే అతనికే మంచిది. బ్యాటింగ్‌ టెక్నిక్‌లో అతడు  చేస్తున్న లోపాల్ని  సరిదిద్దుకోవడానికి సమయం దొరుకుతుందని అన్నాడు. 

ఇవి కూడా చదవండి:

2000 కి.మీ. మేర చైనా మ‌రో గోడ‌

కోవిడ్ గ‌ర్భిణుల‌కు పుట్టిన శిశువుల్లో యాంటీబాడీలుlogo