శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 28, 2020 , 13:26:41

రెండ‌వ టెస్టుకు పృథ్వీ షా..

రెండ‌వ టెస్టుకు పృథ్వీ షా..

హైద‌రాబాద్‌:  రేప‌టి నుంచి న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న రెండ‌వ టెస్టులో పృథ్వీ షా ఆడ‌నున్నాడు. యువ బ్యాట్స్‌మెన్ షా.. ఫిట్‌గా ఉన్నాడ‌ని కోచ్ ర‌విశాస్త్రీ తెలిపాడు.  ట్రైనింగ్ సెష‌న్‌కు దూరంగా ఉన్న పృథ్వీపై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. అయితే అత‌ను క్రైస్ట్‌చ‌ర్చ్ టెస్టులో ఆడుతాడ‌ని ర‌విశాస్త్రీ క్లారిటీ ఇచ్చాడు. తొలి టెస్టులో మ‌యాంక్‌తో క‌లిసి పృథ్వీ ఓపెన‌ర్‌గా దిగాడు.  రోహిత్ లేక‌పోవ‌డం వ‌ల్ల అత‌నికి ఓపెనింగ్ ఛాన్స్ ఇచ్చారు. ఆ టెస్టులో పృథ్వీ తొలి ఇన్నింగ్స్‌లో 16 ర‌న్స్ చేశాడు. టెక్నిక్ స‌రిగా లేని కార‌ణంగా.. అత‌ని ఆట‌తీరుపై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.  ప్ర‌తి ఒక ప్లేయ‌ర్ కూడా కండీష‌న్స్ త‌గిన‌ట్లుగా ఆడాల్సి ఉంటుంద‌ని శాస్త్రి అన్నాడు. తుది జ‌ట్టు కోసం అశ్విన్ లేదా జ‌డేజా ఎంపిక నిర్ణ‌యాన్ని శ‌నివార‌మే తీసుకోనున్న‌ట్లు చెప్పారు.  

 


logo