Sports
- Feb 21, 2021 , 16:23:24
VIDEOS
పృథ్వీ షా వీరవిహారం

ముంబై: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పలువురు ఆటగాళ్లు సంచలన ప్రదర్శన చేస్తున్నారు. ఢిల్లీతో మ్యాచ్లో యువ ఓపెనర్ పృథ్వీ షా(105 నాటౌట్: 89 బంతుల్లో 15ఫోర్లు, 2సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ముంబై అద్భుత విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 50 ఓవర్లలో 7 వికెట్లకు 211 రన్స్ చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, అనుజ్ రావత్ డకౌటయ్యారు. హిమ్మత్ సింగ్(106 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం ముంబై 31.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్(50) అర్ధసెంచరీతో మెరిశాడు.
తాజావార్తలు
MOST READ
TRENDING