ఆదివారం 17 జనవరి 2021
Sports - Dec 17, 2020 , 17:36:54

పృథ్వీ షా డకౌట్‌..ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

పృథ్వీ షా డకౌట్‌..ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

అడిలైడ్:  ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన పృథ్వీ షా(0: 2బంతుల్లో) మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతికే వెనుదిరిగాడు.  ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను తప్పించి షాను తొలి టెస్టుకు ఎంపిక చేయడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో  మండిపడుతున్నారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తుది జట్టులో చోటు దక్కించుకున్న షా మరోసారి తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. 

అతడు ఔటైన తీరుపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బంతిని అంచనావేయడంలో విఫలమైన షా..స్టార్క్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తమదైన శైలిలో  సెటైర్లు, మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు.  గులాబీ టెస్టులో   ఓపెన‌ర్లుగా వ‌చ్చిన షా (0), మ‌యాంక్ అగ‌ర్వాల్ (17) విఫ‌ల‌మ‌య్యారు. 

 ఇవి కూడా చదవండి:

విరాట్‌ కోహ్లీ నయా రికార్డు

పింక్ బాల్ టెస్ట్.. తొలిరోజు టీమిండియా 233/6