శనివారం 16 జనవరి 2021
Sports - Dec 18, 2020 , 17:20:58

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 9/1

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 9/1

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టులో టీమ్‌ఇండియా మెరుగైనస్థితిలో నిలిచింది. గులాబీ బంతితో భారత బ్యాట్స్‌మెన్‌,  బౌలర్లు సత్తాచాటారు. రెండో రోజు శుక్రవారం ఆటలో కోహ్లీసేన ఆధిపత్యం ప్రదర్శించింది.  తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 191 పరుగులకే పరిమితం చేసిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.  రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 9 పరుగులు చేసింది.

యువ ఓపెనర్‌ పృథ్వీ షా(4) మళ్లీ తన పేలవఫామ్‌ను కొనసాగించాడు. పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో బుమ్రా నైట్‌వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చాడు.  ప్రస్తుతం మయాంక్‌ అగర్వాల్‌(5), బుమ్రా(0) క్రీజులో ఉన్నారు.  ప్రస్తుతం భారత్‌ 62 ఆధిక్యంలో కొనసాగుతోంది. 

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 72.1 ఓవర్లలో  191 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించింది.  తొలి టెస్టులో భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(4/55)  తన మాయాజాలాన్ని ప్రదర్శించి కంగారూల పతనాన్ని శాసించాడు.   బుమ్రా(2/52), ఉమే‌శ్‌ యాదవ్‌(3/40)లకు  వికెట్లు దక్కాయి. ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(73 నాటౌట్‌) ఒక్కడే  అర్ధశతకంతో మెరిశాడు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 రన్స్‌కు ఆలౌటైంది. 

ఇవి కూడ చదవండి:

ఆస్ట్రేలియా 191 ఆలౌట్‌

కోహ్లీ బ్రిలియంట్‌ క్యాచ్‌: వీడియో