మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 29, 2020 , 15:08:40

రికార్డుల షా..: సచిన్‌ తర్వాత ఆ రికార్డు పృథ్వీషాదే

రికార్డుల షా..: సచిన్‌ తర్వాత ఆ రికార్డు పృథ్వీషాదే

క్రైస్ట్‌చర్చ్‌   న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో విఫలమైన  భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షా(54: 64 బంతుల్లో 8ఫోర్లు, సిక్స్‌) రెండో టెస్టులో ఫర్వాలేదనిపించాడు.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(7) వికెట్‌ను కోల్పోయినా దూకుడుగా ఆడి జట్టుకు మంచి ఆరంభం అందించాడు. మంచి షాట్లతో  కివీస్‌ పేసర్లపై ఎదురుదాడికి దిగాడు.  వేగంగా ఆడి 61 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వాగ్నర్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాది హాఫ్‌సెంచరీ మార్క్‌ చేరుకోవడం విశేషం. మంచి జోరుమీదున్న షా.. జేమిసన్‌ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఐతే టెస్టు కెరీర్‌లో విదేశీ పర్యటనలో రెండో టెస్టు ఆడుతున్న  షా న్యూజిలాండ్‌ గడ్డపై అరుదైన ఘనత సాధించాడు. కివీస్‌లో.. టెస్టుల్లో అర్ధశతకం బాదిన రెండో అతిపిన్న వయస్కుడిగా షా( 20 years and 112 days) నిలిచాడు.  అతనికన్నా ముందు 1990లో భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌(16 years and 291 days) అతి పిన్న వయసులో టెస్టు ఫిఫ్టీ చేసి చరిత్ర సృష్టించాడు.  భారత్‌ తరపున సచిన్‌ 17 ఏళ్ల 107 రోజుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. సచిన్‌ తర్వాత శతకం సాధించిన రెండో అతిపిన్న వయస్కుడిగా షా రికార్డు నెలకొల్పడం విశేషం. logo
>>>>>>