శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 22, 2020 , 10:19:25

న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు ప్రకటన

న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు ప్రకటన

న్యూజిలాండ్‌తో వచ్చే నెల ఐదో తేదీ నుంచి జరిగే మూడో వన్డేల సిరీస్‌ కోసం సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ప్రకటించింది.

  • వన్డే జట్టులో పృథ్వీ

ముంబై: న్యూజిలాండ్‌తో వచ్చే నెల ఐదో తేదీ నుంచి జరిగే మూడో వన్డేల సిరీస్‌ కోసం సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ప్రకటించింది. గాయం కారణంగా శిఖర్‌ ధవన్‌ దూరమవడంతో దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముంబై యువ ఆటగాడు పృథ్వీ షా జట్టులో చోటు దక్కించుకున్నాడు. డోపింగ్‌ పరీక్షల్లో విఫలమై ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొన్నాక జాతీయ జట్టుకు పృథ్వీ తొలిసారి ఎంపికయ్యాడు. వన్డేల్లో కేదార్‌ జాదవ్‌ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫిబ్రవరి 5, 8, 11 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

వన్డే జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌, కేదార్‌ జాదవ్‌


logo