బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 17, 2020 , 14:58:49

పాంటింగ్ చెప్పిన‌ట్లే పృథ్వి ఔట్‌.. వీడియో

పాంటింగ్ చెప్పిన‌ట్లే పృథ్వి ఔట్‌.. వీడియో

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో రెండో బంతికే ఓపెన‌ర్ పృథ్వి షా ఔట‌వ‌డంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో అత‌న్ని ట్రోల్ చేస్తున్నారు. అయితే పృథ్వి ఎలా ఔట‌య్యే అవ‌కాశం ఉందో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చెబుతున్న స‌మ‌యంలోనే.. అత‌డు క‌చ్చితంగా అలాగే ఔట్ కావ‌డం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఐపీఎల్‌లో ఢిల్లీ టీమ్ కోచ్‌గా ఉన్న పాంటింగ్‌కు పృథ్వి బ్యాటింగ్‌లోని లోపాలు బాగా తెలుసు. అదే విషయాన్ని కామెంట‌రీ బాక్స్‌లో ఉన్న పాంటింగ్ చెబుతున్నాడు. పృథ్వి త‌న శ‌రీరానికి దూరంగా వెళ్లే బంతిని సులువుగానే ఆడ‌తాడ‌ని, అయితే లోప‌లికి దూసుకొచ్చే బంతితోనే ఇబ్బంది పెడ‌తాడ‌ని పాంటింగ్ చెప్పాడు. బ్యాట్‌కు, ప్యాడ్‌కూ మ‌ధ్య ఎక్కువ గ్యాప్ వ‌ద‌ల‌డం పృథ్వి బ‌ల‌హీన‌త అని కూడా రికీ అన్నాడు. ఆస్ట్రేలియా క‌చ్చితంగా ఇక్క‌డే అత‌న్ని టార్గెట్ చేస్తుంది. స్టార్క్ బంతిని లోప‌లికి స్వింగ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు అని పాంటింగ్ చెప్పాడు. అయితే అదే స‌మ‌యంలో బౌలింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్‌.. పాంటింగ్ ఊహించిన‌ట్లుగానే త‌న త‌ర్వాతి బంతిని లోప‌లికి స్వింగ్ చేయ‌డంతో పృథ్వి దానిని ఆడ‌లేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

పృథ్వి షా కొంత‌కాలంగా ప‌రుగులు చేయ‌డానికి తంటాలు ప‌డుతున్నాడు. టెస్ట్‌కు ముందు ఆడిన రెండు వామ‌ప్ మ్యాచ్‌ల‌లోనూ అత‌ను ఫెయిల‌య్యాడు. అయినా టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం శుభ్‌మ‌న్ గిల్‌ను కాద‌ని పృథ్వీకే తుది జ‌ట్టులో అవ‌కాశం ఇచ్చింది. అయినా ఈ అవ‌కాశాన్ని కూడా అత‌డు స‌ద్వినియోగం చేసుకోలేక ఆడిన రెండో బంతికే డ‌కౌట‌య్యాడు.


logo