మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 06, 2020 , 15:38:53

ఐపీఎల్13‌.. భువీ స్థానంలో పృథ్వీరాజ్‌

ఐపీఎల్13‌.. భువీ స్థానంలో పృథ్వీరాజ్‌

హైద‌రాబాద్‌:  ఐపీఎల్‌లో హైద‌రాబాదీ జ‌ట్టుకు భారీ షాక్ త‌గ‌లిన విష‌యం తెలిసిందే.  గాయం కార‌ణంగా భువ‌నేశ్వ‌ర్‌ను త‌ప్పించారు. అయితే ఆ స్పీడ్‌స్ట‌ర్ స్థానంలో పృథ్వీరాజ్ య‌ర్ర‌ను తీసుకున్నారు.   సీజ‌న్ మొత్తం పృథ్వీరాజ్ .. స‌న్‌రైజ‌ర్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు.  22 ఏళ్ల పృథ్వీ.. 11 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. తొమ్మిది ఏ లిస్ట్ మ్యాచ్‌లు, మూడు టీ20 గేమ్‌లు ఆడాడు. ఎడ‌మ చేతి బౌల‌ర్ అయిన పృధ్వీ ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌స్ట్ క్లాస్‌లో 39 వికెట్లు తీసుకున్నాడు. గత శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తూ భువీ గాయపడ్డాడు. కండరాల గాయం వల్ల భువనేశ్వర్‌ కుమార్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. అతడికి 6 నుంచి 8వారాల విశ్రాంతి అవసరం. ఆస్ట్రేలియా పర్యటనలోనూ భువీ ఆడడం అనుమానమే అని ఓ అధికారి చెప్పారు.