శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 17:15:26

గర్వంగా ఉంది...చిరునవ్వుతో తిరిగి వెళ్తున్నా: ప్రీతి జింతా

గర్వంగా ఉంది...చిరునవ్వుతో తిరిగి వెళ్తున్నా: ప్రీతి జింతా

దుబాయ్: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ప్రదర్శన, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆటతీరుపై ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింతా ప్రశంసల జల్లు కురిపించారు.  బెంగళూరుపై భారీ తేడాతో గెలుపొందిన పంజాబ్‌ బృందాన్ని ప్రీతి ట్విటర్లో  అభినందించారు.  రెండు వారాల క్రితం యూఏఈకి వచ్చిన ప్రీతి తప్పనిసరి క్వారంటైన్‌ పూర్తైన తర్వాత పంజాబ్‌ ఆడిన రెండు మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి వీక్షించారు. 

'బెంగళూరుతో మ్యాచ్‌లో పంజాబ్‌ ఆడిన తీరుపట్ల చాలా గర్వంగా ఉంది.  పంజాబ్‌ ఆటగాళ్లు ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ ధరించడాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జట్టును ముందుండి నడిపించి, అజేయ సెంచరీ 132తో చెలరేగిన కేఎల్‌ రాహుల్‌కు అభినందనలు. ముఖంలో చిరున‌వ్వుతో దుబాయ్‌ నుంచి వెళ్లిపోతున్నాను' అంటూ ప్రీతి ట్వీట్‌ చేసింది. పర్పుల్‌, ఆరెంజ్‌ క్యాప్‌లు ధరించిన మహ్మద్‌ షమీ, కేఎల్‌ రాహుల్‌ కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. 


logo