సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 15:07:40

తొలిసారి వర్చువల్‌గా క్రీడా పురస్కారాలు అందజేత

తొలిసారి వర్చువల్‌గా  క్రీడా పురస్కారాలు అందజేత

న్యూఢిల్లీ: సాధారణంగా ప్రతి ఏడాది దిగ్గజ హాకీ క్రీడాకారుడు, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న  అవార్డులను అందజేస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  భారత్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన  అథ్లెట్లకు అవార్డులు  అందజేశారు. 

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి  తగ్గకపోవడంతో  ఈసారి వర్చువల్‌ విధానం ద్వారా క్రీడాకారులకు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి  రాష్ట్రపతితో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (విజ్ఞాన్‌ భవన్‌ నుంచి )  తదితరులు హాజరయ్యారు. అవార్డు విన్నర్లను రాష్ట్రపతి భవన్‌లోని  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో దేశంలోని తొమ్మిది వేర్వేరు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కేంద్రాల నుంచి వర్చువల్‌గా  అనుసంధానించారు.

ఈ కార్యక్రమానికి అత్యున్నత క్రీడా పురస్కారం  ఖేల్‌రత్న విజేతలు రాణీ రాంపాల్‌(హాకీ), మనికా బాత్రా(టీటీ), మరియప్పన్‌ తంగవేలు(అథ్లెటిక్స్‌) హాజరయ్యారు. కరోనా వైరస్‌ సోకడంతో వినేశ్‌ ఫొగట్‌(రెజ్లింగ్‌), ఐపీఎల్‌ 2020  కోసం యూఏఈ వెళ్లడంతో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అవార్డులను అందుకోలేకపోయారు. ‌ ఫాస్ట్‌బౌలర్‌  ఇషాంత్‌ శర్మ(అర్జున విన్నర్) కూడా హాజరుకాలేదు.


logo