గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 20, 2021 , 00:41:49

16 జట్లు.. 21 మ్యాచ్‌లు

16 జట్లు.. 21 మ్యాచ్‌లు

  • సిద్ధమైన మీడియా ప్రీమియర్‌ లీగ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: నిత్యం వార్తా సేకరణలో బిజీగా గడిపే జర్నలిస్టుల ఆటవిడుపు కోసం 7హెచ్‌ స్పోర్ట్స్‌ సంస్థ నిర్వహిస్తున్న మీడియా ప్రీమియర్‌ లీగ్‌(ఎమ్‌పీఎల్‌) సర్వ హంగులతో సిద్ధమైంది. ఈనెల 22 నుంచి మార్చి 10 వరకు జరుగనున్న ఎమ్‌పీఎల్‌ టీ20 టోర్నీ ట్రోఫీలు, జెర్సీలు, డ్రాలను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 16 జట్ల కలయికతో ముందుకొస్తున్న ఎమ్‌పీఎల్‌.. లీగ్‌కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరుగనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు ఎల్బీ స్టేడియం ఆతిథ్యమిస్తుండగా, మిగిలిన మ్యాచ్‌లకు మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ (ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ) వేదిక కానుంది. కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సమాచారాన్ని సేకరించిన తమ కోసం క్రికెట్‌ లీగ్‌ జరుపడంపై నిర్వాహకులకు మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి, టోర్నీ స్పాన్సర్‌ నంది టైర్స్‌ ఎండీ భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచే వారికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా ఎలక్ట్రిక్‌ స్కూటీని అందించనున్నట్లు నిర్వాహకుడు వెంకటేశ్‌ తెలిపాడు. 

VIDEOS

logo