శనివారం 28 మార్చి 2020
Sports - Jan 31, 2020 , 02:07:12

సింధు X తై జూ

 సింధు X తై జూ


హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌లో రసవత్తర పోరు జరుగనుంది. గచ్చిబౌలీ స్టేడి యంలో  హైదరాబాద్‌ హంటర్స్‌ - బెంగళూరు రాప్టర్స్‌ శుక్రవారం తలపడనున్నాయి. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు.. తైజూ యింగ్‌తో పోటీ పడనుంది. కాగా గురువారం ఇక్కడ రెండు టైలు జరుగగా.. పుణె 7ఏసెస్‌ 5-2తో గెలిచి చెన్నై సూపర్‌స్టార్స్‌ జోరుకు బ్రేకులు వేసింది. మరో మ్యాచ్‌లో నార్త్‌ఈస్టర్న్‌ వారియర్స్‌ 5-2తేడాతో ముం బై రాకెట్స్‌పై గెలిచింది. 

 టీటీ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం


జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర జట్టును గురువారం అభినందిస్తున్న  టీటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యదర్శి ప్రకాశ్‌ రాజ్‌. ఈ టోర్నీలో పీఎస్‌పీబీ, ఆర్‌ఎస్‌పీబీ జట్లు టైటిళ్లను దక్కించుకున్నాయి. 


logo