గురువారం 04 మార్చి 2021
Sports - Feb 19, 2021 , 13:08:28

మేం షారుక్‌ఖాన్‌ను కొనేశాం.. ఆర్య‌న్‌ను టీజ్ చేసిన ప్రీతి

మేం షారుక్‌ఖాన్‌ను కొనేశాం.. ఆర్య‌న్‌ను టీజ్ చేసిన ప్రీతి

చెన్నై: ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) వేలంలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు జ‌రిగాయి. ఇందులో తొలిసారి బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్‌ఖాన్‌, ఒక‌ప్ప‌టి బాలీవుడ్‌ బ్యూటీ జూహీచావ్లా కూతురు జాన్వీ మెహ‌తా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఈ ఇద్ద‌రూ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టేబుల్ ద‌గ్గ‌ర క‌నిపించారు. ఈ టీమ్‌కు షారుక్‌, జూహీ కోఓన‌ర్లుగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సంద‌ర్భంగా ఓ స‌ర‌దా సీన్ క‌నిపించింది. ఇదే వేలంలో త‌మిళ‌నాడు క్రికెట‌ర్ మ‌సూద్ షారుక్‌ఖాన్ కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. అత‌న్ని పంజాబ్ కింగ్స్ టీమ్ ఏకంగా రూ.5.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. షారుక్ బిడ్ గెలిచిన వెంట‌నే ఆనందం ప‌ట్ట‌లేని ప్రీతి జింటా.. షారుక్‌ను మేం కొనేశాం అని కోల్‌క‌తా టేబుల్ ద‌గ్గ‌ర ఉన్న ఆర్య‌న్‌ను చూస్తూ అరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. మ‌రోవైపు ఆర్య‌న్‌ను చూసిన చాలా మంది షారుక్ అభిమానులు.. అత‌డు అచ్చూ త‌మ హీరోలాగే ఉన్నాడ‌ని మురిసిపోయారు. 

VIDEOS

logo