బుధవారం 05 ఆగస్టు 2020
Sports - Jul 08, 2020 , 10:44:10

ప్రవీణ్‌ తాంబేకు లైన్‌క్లియర్‌

ప్రవీణ్‌ తాంబేకు లైన్‌క్లియర్‌

ముంబై: భారత వెటరన్‌ లెగ్‌స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో ఆడేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. తాజాగా అతడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో సీపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ అతడిని అడ్డుకొనే అవకాశాలు లేవు. సీపీఎల్‌  ఆటగాళ్ల వేలంలో 48ఏండ్ల తాంబేను  ట్రిన్‌బాగో  నైట్‌ రైడర్స్‌ ఫ్రాంచైజీ దక్కించుకున్నది. సీపీఎల్‌లో ఆడనున్న  తొలి భారత క్రికెటర్‌గా ప్రవీణ్‌ నిలిచాడు. 

బీసీసీఐ నిబంధనల ప్రకారం, అన్ని ఫార్మాట్ల నుంచి అతడు రిటైర్‌ కావడంతో ఇకపై  విదేశీ లీగ్‌లో   ఆడేందుకు మార్గం సుగమమైంది.  తాంబే రిటైర్డ్‌ ప్లేయర్‌ అని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసీఏ) అధికారి ఒకరు చెప్పారు.  తొలుత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ప్రవీణ్‌ తర్వాత వెనక్కి తీసుకున్నాడని, తాజాగా  అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ఇ-మెయిల్‌ పంపాడని అధికారి  ధ్రువీకరించారు.  దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్న ఆటగాళ్లు   విదేశాల్లో ప్రైవేట్‌ లీగ్‌ల్లో  ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo