బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 19:41:55

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌గా తాంబే

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌గా తాంబే

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) తరఫున ఆడే అవకాశాన్ని కోల్పోయిన వెటరన్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే మళ్లీ కోల్‌కతా ఫ్రాంఛైజీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐతే ఈసారి ఆటగాడిగా కాదు. కేకేఆర్‌ సహాయక సిబ్బందిలో 48 ఏండ్ల తాంబే భాగంకాబోతున్నాడు.  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌గా సీనియర్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌  నియమితుడయ్యాడు. 

రాబోయే ఐపీఎల్‌కు  సన్నద్ధమవుతున్న  జట్టుకు  సాయం చేయడానికి   తాంబే యూఏఈలోని ఫ్రాంఛైజీతో చేరనున్నట్లు కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ ధ్రువీకరించారు.  గతేడాది డిసెంబర్‌‌లో జరిగిన వేలంలో  తాంబేను కోల్‌‌కతా రూ. 20 లక్షల బేస్‌ ప్రైస్‌‌కు తీసుకున్నది. తాంబే విదేశీ లీగ్‌లో ఆడటంతో ఐపీఎల్‌లో పాల్గొనకుండా బీసీసీఐ అతనిపై నిషేధం విధించింది. 


logo