శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 19, 2020 , 01:11:27

ఆస్ట్రేలియా ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌

మెల్‌బోర్న్‌: భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. నేరు గా ప్రధాన టోర్నీకి క్వాలిఫై అయిన ఓ ఆటగాడు చివరి నిమిషంలో బరిలో నుంచి తప్పుకోవడంతో ప్రజ్నేశ్‌కు ఈ అవకాశం దక్కింది. క్వాలిఫయింగ్‌ టోర్నీ ఫైనల్‌ రౌండ్‌ లో లాత్వియాకు చెందిన ఎర్నెస్ట్స్‌ గుల్బియా చేతిలో ఓడిన ప్రజ్నేశ్‌.. మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో టసుమా ఇటో (జపాన్‌)తో పోటీపడనున్నాడు. ప్రజ్నేశ్‌ తనకంటే 22 స్థానాలు వెనుక ఉన్న ఇటోపై నెగ్గితే.. రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌తో తలపడే అవకాశాలున్నాయి. 


logo