సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 13:29:58

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ప్ర‌జ్ఞా ఓజా

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ప్ర‌జ్ఞా ఓజా

హైద‌రాబాద్‌:  స్పిన్న‌ర్ ప్ర‌జ్ఞా ఓజా.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్న‌ట్లు తెలిపాడు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు.  హైద‌రాబాదీ స్పిన్న‌ర్ ఓజా.. 24 టెస్టులు, 18 వ‌న్డేలు, ఆరు టీ20లు ఆడాడు.  జీవితంలో మ‌రో అంకాన్ని ఆరంభించ‌నున్న‌ట్లు ప్ర‌జ్ఞా త‌న ట్వీట్‌లో తెలిపాడు. 2013లో స‌చిన్‌కు ఫేర్‌వెల్ ఇచ్చిన టెస్టులో చివ‌రిసారి ఆడాడు. ముంబైలో వెస్టిండీస్‌తో ఆ మ్యాచ్ జ‌రిగింది.  2009 నుంచి 2013 మ‌ధ్య కాలంలో అత‌ను 113 టెస్టు వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో డెక్క‌న్ చార్జ‌ర్స్‌, ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడాడు.  


logo