బుధవారం 08 జూలై 2020
Sports - Apr 13, 2020 , 20:10:41

వాయిదా మంచికే: బాక్స‌ర్ వికాస్

వాయిదా మంచికే:  బాక్స‌ర్ వికాస్

న్యూఢిల్లీ: ప‌్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ వాయిదా ప‌డ‌టంతో ల‌భించిన ఏడాది గ‌డువును సద్వినియోగం చేసుకుంటాన‌ని భార‌త యువ బాక్స‌ర్ వికాస్ క్రిష‌న్  పేర్కొన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన వికాస్‌.. విశ్వ‌క్రీడ‌ల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిపాడు. 

`కెరీర్ ఆరంభించినప్ప‌టి నుంచి ఇన్ని రోజులు ఇంట్లో ఎప్పుడూ లేను. మొద‌టి సారి అనుకోకుండా ల‌భించిన ఈ విరామాన్ని కుటుంబంతో గ‌డుపుతున్నా. టోక్యో ఒలింపిక్స్ వాయిదా వార్త విన‌గానే చాలా సంతోషించా. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. మ‌రో ఏడాది స‌మ‌యం ల‌భించ‌డం మొద‌టిదైతే.. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై యుద్ధం చేయ‌డమే ప్ర‌పంచ ఉద్దేశం కావ‌డం రెండోది. ఇంటి వ‌ద్దే ఉంటూ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు చేయాల్సిన వ్యాయామాల‌ను కొన‌సాగిస్తున్నా` అని వికాస్ అన్నాడు. 


logo