శనివారం 30 మే 2020
Sports - Apr 10, 2020 , 14:35:32

ఒలింపిక్స్.. వాయిదాను వాడుకుంటా: దీపా క‌ర్మాక‌ర్‌

ఒలింపిక్స్.. వాయిదాను వాడుకుంటా:  దీపా క‌ర్మాక‌ర్‌

చండీగ‌ఢ్‌: ప‌్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ వాయిదా ప‌డ‌టంతో ల‌భించిన గ‌డువును వినియోగించుకోవాల‌నుకుంటున్న‌ట్లు భార‌త స్టార్ జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్ పేర్కొంది. మోకాలి గాయం కార‌ణంగా గ‌త కొంత‌కాలంగా టోర్నీల‌కు దూరంగా ఉంటున్న ఆమె.. ఈ ఏడాది స‌మ‌యంలో కోలుకొని తిరిగి బ‌రిలో దిగుతానని ఆశాభావం వ్య‌క్తం చేసింది. అయితే జిమ్నాస్టిక్స్‌లో 65 నుంచి 70 శాతం ఒలింపిక్స్ బెర్త్‌లు ఖ‌రార‌య్యాయని.. ఇక త‌న ముందు రెండు అవ‌కాశాలే ఉన్నాయ‌ని ఆమె చెప్పింది. 

`టోక్యో ఒలింపిక్స్‌లో 70 శాతం జిమ్నాస్ట్ బెర్త్‌లు ఇప్ప‌టికే ఖ‌రార‌య్యాయి. వీటి కోసం మొత్తం ఎనిమిది ప్ర‌పంచక‌ప్‌లు నిర్వ‌హించ‌గా.. అందులో ప్ర‌స్తుతం రెండు మాత్ర‌మే మిగిలున్నాయి. ముంద‌స్తు షెడ్యూల్ ప్ర‌కారం ఈ రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు ఈ ఏడాది మార్చిలో జ‌రుగాల్సి ఉండ‌గా.. విశ్వ‌క్రీడ‌ల వాయిదా నేప‌థ్యంలో జూన్‌లో జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని బ‌ట్టి చూస్తే జూన్‌లో జ‌రుగ‌డం కూడా క‌ష్ట‌మే అనిపిస్తున్నది. ఈ రెండు టోర్నీలు వ‌చ్చే ఏడాది నిర్వ‌హిస్తే ప్రాక్టీస్‌కు త‌గినంత స‌మ‌యం ల‌భిస్తుంది. ఆలోపు నా గాయం కూడా మానుతుంది. ఒలింపిక్స్ అర్హ‌త సాధించ‌డం అనేది ఇప్పుడు నా చేతిలో లేదు. ఆ టోర్నీల‌పైనే ఆశ‌లు పెట్టుకున్నా`అని క‌ర్మాక‌ర్ చెప్పింది. 2016 రియో ఒలింపిక్స్‌లో త్రుటిలో ప‌త‌కం చేజార్చుకున్న దీపా.. ఈ సారి ప‌త‌కం సాధించ‌డం ప‌క్కా అనుకుంటే.. ఊహించ‌ని గాయం ఆమె కెరీర్‌ను ప్ర‌మాదంలో ప‌డేసింది.logo