గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Mar 15, 2020 , 00:02:57

ఫుట్‌బాల్‌ టోర్నీలన్నీ వాయిదా

ఫుట్‌బాల్‌ టోర్నీలన్నీ వాయిదా

పారిస్‌: కరోనా వైరస్‌ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి, ఏప్రిల్‌లో అంతర్జాతీయ టోర్నీలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ఫిఫా శనివారం ప్రకటించింది. ఆయా క్లబ్‌లు తమ ఆటగాళ్లను ఈ రెండు నెలల పాటు జాతీయ జట్లకు ఆడేందుకు అనుమతించవద్దంటూ ఫిఫా స్పష్టం చేసింది. ఆసియా, దక్షిణఅమెరికాలో వాయిదాపడ్డ 2022 ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల రీషెడ్యూల్‌పై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొంది. మరోవైపు అన్నిస్థాయిల టోర్నీలను ఈనెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌) శనివారం స్పష్టం చేసింది. logo