శనివారం 11 జూలై 2020
Sports - May 05, 2020 , 15:50:43

వార్త‌ల‌కు దూరంగా ఉంటున్నా: డుప్లెసిస్‌

వార్త‌ల‌కు దూరంగా ఉంటున్నా:  డుప్లెసిస్‌

కేప్‌టౌన్‌:  క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో తాను వార్త‌ల‌కు దూరంగా ఉంటున్నాన‌ని ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. క‌ష్ట‌కాలంలో విప‌త్తుకు సంబంధించిన వార్త‌లు ఎక్కువ‌గా చూస్తే.. భావోద్వేగాల‌కు లోను కావ‌ల్సి ఉంటుందని అందుకే.. తాను వార్త‌ల జోలికి వెళ్ల‌డం లేద‌ని ఫాప్ చెప్పాడు. 

`అంత‌ర్జీతీయ స్థాయి ఆట‌గాళ్లుగా సానుకూల దృక్ప‌థంతో ఎలా ముందుకు సాగాలో తెలుసు. ఈ విప‌త్క‌ర స‌మ‌యాల్లో ఎక్కువ బాధాక‌ర విష‌యాల జోలికి వెళ్ల‌డం లేదు. అందుకే వార్త‌లు చూడం త‌గ్గించా` అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. 


logo