బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 28, 2020 , 13:55:26

క‌ళ్లు చెదిరే పూర‌న్ ఫీల్డింగ్‌.. స‌చిన్ ప్ర‌శంస‌లు

క‌ళ్లు చెదిరే పూర‌న్ ఫీల్డింగ్‌.. స‌చిన్ ప్ర‌శంస‌లు

హైద‌రాబాద్: షార్జాలో జ‌రుగుతున్న ఐపీఎల్‌లో కింగ్స్ లెవ‌న్ పంజాబ్ ప్లేయ‌ర్ నికోల‌స్ పూర‌న్ అద్భుత‌మైన ఫీల్డింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.  ఆదివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో .. బౌండ‌రీ లైన్ వ‌ద్ద పూర‌న్ గాలిలో తేలుతూ బంతిని అందుకున్న తీరు అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.  సంజూ శాంస‌న్ కొట్టిన భారీ షాట్ దాదాపు సిక్స‌ర్‌గా వెళ్లిపోయింది. అయితే బౌండ‌రీ రోప్ వ‌ద్ద ఉన్న నికోల‌స్ పూర‌న్ .. గాలిలో డైవ్ చేస్తూ ఆ బంతిని అందుకున్నాడు. త‌న కాలును నేల‌మీద పెట్ట‌క‌ముందే.. ఆ బంతిని మ‌ళ్లీ గ్రౌండ్‌లోకి విసిరేశాడు‌.  బౌండ‌రీ రోప్‌కు తాక‌కుండా గాలిలోకి ఎగిరిన పూర‌న్.. అంతే స‌మ‌య‌స్పూర్తితో ఆ బంతిని వెంట‌నే మైదానంలోకి ప‌డేశాడు.  గ్రౌండ్‌పై వాల‌క‌ముందే  విండీస్ ప్లేయ‌ర్ బంతిని వ‌దిలిన తీరు మాజీ క్రికెట‌ర్ల‌ను కూడా ఆక‌ట్టుకుంటున్న‌ది. ఇలాంటి ఫీల్డింగ్‌ను గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేని కొంద‌రు క్రికెట‌ర్లు కామెంట్ చేశారు.  పూర‌న్ ఫీల్డింగ్ ప్ర‌మాణాలు అద్భుత‌మ‌ని హ‌ర్షాబోగ్లే ట్వీట్ చేశారు. ఇక మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా పూరన్ ఫీల్డింగ్ విన్యాసాల‌ను మెచ్చుకున్నారు. నా జీవితంలో చూసిన అత్య‌ద్భుత‌మైన ఫీల్డింగ్ ఇదే అని స‌చిన్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని స‌చిన్ పేర్కొన్నారు. 

 


logo