శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 00:22:20

వరల్డ్‌ టీ20 ఎలెవన్‌లో పూనమ్‌

వరల్డ్‌  టీ20 ఎలెవన్‌లో పూనమ్‌

దుబాయ్‌: ఆస్ట్రేలియా వేదికగా తాజాగా ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటిన క్రికెటర్లతో వరల్డ్‌ ఎలెవన్‌ జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో భారత్‌ నుంచి సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌కు మాత్రమే చోటు దక్కగా, మిగతావారికి  నిరాశే ఎదురైంది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన యువ సంచలనం షెఫాలీవర్మ 12వ ప్లేయర్‌గా ఎంపికైంది.  ఐదోసారి ప్రపంచకప్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. 

ఐసీసీ వరల్డ్‌ టీ20 ఎలెవన్‌: ఎలీసా హిలీ, బేత్‌ మూనీ, నాట్‌ స్కీవర్‌, హీథర్‌ నైట్‌, మెగ్‌ లానింగ్‌, లారా వోల్వార్డ్‌, జెస్‌ జొనాసెన్‌, సోఫీ ఎక్లస్టోన్‌, అన్య శ్రుభ్‌సోల్‌, మేగన్‌ స్కట్‌, పూనమ్‌ యాదవ్‌, షఫాలీవర్మ(12వ ప్లేయర్‌) 


logo