బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 16:41:48

టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన పూజారాణి..

టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన పూజారాణి..

జోర్డాన్‌: భారత స్టార్‌ బాక్సర్‌ పూజారాణి టోక్యో ఒలంపిక్స్‌-2020కి అర్హత సాధించారు. జోర్డాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా ఒలంపిక్స్‌ అర్హత పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన బాక్సర్‌ పోర్నిపాపై 5-0తో పూజారాణి ఏకపక్ష విజయం సాధించింది. 75 కేజీల విభాగంలో నాలుగో సీడ్‌ పూజారాణి.. థాయ్‌ బాక్సర్‌ పోర్నిపాపై పంచ్‌ల వర్షం కురిపించింది. తద్వారా, 5-0తో బౌట్‌ గెలిచి.. సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆసియా నుంచి విశ్వక్రీడలకు అర్హత సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా  పూజా రికార్డు సృష్టించింది. 


logo
>>>>>>