సోమవారం 25 మే 2020
Sports - Apr 08, 2020 , 22:10:40

2005 యాషెస్ సిరీస్ ఆల్‌టైమ్ గ్రేట్: పాంటింగ్

2005 యాషెస్ సిరీస్ ఆల్‌టైమ్ గ్రేట్: పాంటింగ్

2005 యాషెస్ సిరీస్ ఆల్‌టైమ్ గ్రేట్: పాంటింగ్

సిడ్నీ: ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా వైరస్ కార‌ణంగా ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. త‌మ జ్ఞాప‌కాల‌ను గుర్తుతెచ్చుకుని అభిమానుల‌తో పంచుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ త‌న క్రికెట్ కెరీర్‌లో 2005 యాషెస్ సిరీస్ ఆల్‌టైమ్ గ్రేట్ అంటూ చెప్పుకొచ్చాడు. యాషెస్ సిరీస్‌లలో అద్భుత‌మైన క్ష‌ణాలేంటి అని డేవిడ్ వార్న‌ర్ అడిగిన ప్రశ్న‌కు పంట‌ర్ జ‌వాబిచ్చాడు. ‘ ఆస్ట్రేలియా త‌ర‌ఫున యాషెస్ ఆడ‌టం నా చిన్న‌నాటి క‌ల‌. కెరీర్‌లో ఎనిమిది, తొమ్మిది సిరీస్‌లు ఆడాను. ఇందులో కొన్ని మరిచిపోలేని జ్ఞాప‌కాలు ఉంటే..మ‌రికొన్ని చేదు అనుభ‌వాల ఉన్నాయి. ఈ రెండో కోవ‌కు చెందిందే..2005 యాషెస్ సిరీస్‌. ఇందులో  ఆస్ట్రేలియా 1-2 తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో ఓట‌మి పాలైంది. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో ఆసీస్ ఘ‌న విజ‌యం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టింది. రెండో టెస్టు ఇంగ్లండ్ గెలువ‌గా, మూడోది డ్రాగా ముగిసింది. నాలుగో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యం సాధించింది. ఇక ఆఖ‌రిదైన ఐదో టెస్టు డ్రా కావ‌డంతో మైఖేల్ వాన్ సార‌థ్యంలోని ఇంగ్లండ్‌కు సిరీస్‌ సొంత‌మైంది. రెండో టెస్టులో త్రుటిలో విజ‌యాన్ని చేజార్చుకుని బాధలో ఉన్న బ్రెట్‌లీని చేతిలో చేయి వేసి ఫ్లింటాఫ్ స‌ముదాయించి తీరు ఇప్ప‌టికీ కండ్ల మెదులుతూ ఉంటుంది ’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన పంట‌ర్‌..2012లో క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికాడు. 

Next Article Two Goats

logo