మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Oct 18, 2020 , 21:35:52

MI vs KXIP: డికాక్‌, పొలార్డ్‌ మెరుపులు

MI vs KXIP: డికాక్‌, పొలార్డ్‌ మెరుపులు

దుబాయ్:  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది.   ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(53: 43 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో  ముంబై పోరాడే స్కోరు చేసింది. ఆఖర్లో పొలార్డ్‌(34 నాటౌట్‌: 12 బంతుల్లో 1ఫోర్‌, 4సిక్సర్లు), కృనాల్‌ పాండ్య(34: 30 బంతుల్లో 4ఫోర్లు్, సిక్స్‌), నాథన్‌(24 నాటౌట్:‌ 12 బంతుల్లో 4ఫోర్లు)  మెరుపులు మెరిపించారు.  రోహిత్‌ శర్మ(9), సూర్యకుమార్‌ యాదవ్‌(0), ఇషాన్‌ కిషన్‌(7) విఫలమయ్యారు.  ఓవైపు వికెట్లు పడుతున్నా ముంబై ఏ దశలోనూ జోరు తగ్గించలేదు.  పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ(2/30), అర్షదీప్‌ సింగ్‌(2/35) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. logo