బుధవారం 08 జూలై 2020
Sports - Jun 04, 2020 , 23:50:02

యువరాజ్ ‌పై పోలీసులకు ఫిర్యాదు

యువరాజ్ ‌పై పోలీసులకు ఫిర్యాదు

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డాడు. భారత స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో కులపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ దళిత హక్కుల నేత రజత్‌ కల్సన్‌ హర్యానాలోని హన్సీ పోలీస్‌ స్టేషన్‌లో యువీపై  ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని రజత్‌ డిమాండ్‌ చేశారు.  రోహిత్‌ శర్మతో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడిన యువీ.. చాహల్‌ కులానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశాడు. 


logo