బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 00:36:32

యో-యో టెస్ట్‌ అంటే ఏమిటి?

యో-యో టెస్ట్‌ అంటే ఏమిటి?

  • ‘ఫిట్‌ ఇండియా’ కాన్ఫరెన్స్‌లో కోహ్లీని అడిగిన ప్రధాని 

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ అత్యున్నతంగా ఉండడమే లక్ష్యంగా చేపడుతున్న యోయో టెస్టు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వివరించాడు. ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ తొలి వార్షికోత్సవం సందర్భంగా పలు క్రీడల ప్లేయర్లు, ఫిట్‌నెస్‌ నిపుణులతో మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా యోయో టెస్టు గురించి విరాట్‌ను మోదీ అడిగారు. కెప్టెన్‌కు కూడా ఇది వర్తిస్తుందా అని ప్రశ్నించారు. దీనికి కోహ్లీ నవ్వుతూ బదులిచ్చాడు. ‘ఫిట్‌నెస్‌ పరంగా ఈ టెస్టు చాలా ముఖ్యం. కొన్ని ఇతర దేశాల జట్లతో పోల్చితే ఇప్పటికీ మా ఫిట్‌నెస్‌ స్థాయి కొంచెం తక్కువగా ఉంది. ముందుగా నేనే ఈ టెస్టులో పాల్గొంటాను. ఒకవేళ ఫెయిల్‌ అయితే నేను కూడా జట్టుకు ఎంపిక కాను. ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచేందుకు ఇలాంటి సంస్కృతిని పాటించడం చాలా ముఖ్యం’అని కోహ్లీ అన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్‌కు 55 ఏండ్లు అని తెలుసుకొని మోదీ ఆశ్చర్యపోయారు. ‘మీ వయస్సు గురించి చెప్తున్నది నిజమేనా?’ అని ప్రధాని ప్రశ్నించారు. 


logo