బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 03, 2020 , 14:36:23

కరోనాపై పోరు: క్రీడాకారులకు మోదీ ఐదు సూత్రాలు

కరోనాపై పోరు: క్రీడాకారులకు మోదీ ఐదు సూత్రాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్(కొవిడ్​-19)​పై జరుగుతున్న యుద్ధం గురించి దేశవ్యాప్తంగా ప్రముఖ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్​, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్​ సహా మొత్తం 49మంది క్రీడాకారులు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని క్రీడాకారులను మోదీ కోరారు. అభిప్రాయాలను అడిగి తెలుసున్నారు.  ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రధాని మోదీ ఐదు సూత్రాలను ఉపదేశించారు. కరోనాపై యుద్ధంలో ‘సంకల్స్​(సంకల్పం), సన్యం(సమన్వయం), సంక్రమత(సానుకూలత), సమ్మాన్​(ఐకమత్యం), సహయోగ్​(సహాయం).. అనే సూత్రాలను పాటించాలని,  దేశ ప్రజల్లో ధైర్యాన్ని, సానుకూలతను నింపాలని క్రీడాకారులకు సూచించారు. కరోనాపై గెలిచేందుకు విరాట్​ కోహ్లీ లాగా అందరం పోరాట స్ఫూర్తి కనబరచాలని ప్రధాని చెప్పారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్​లో టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్​శర్మ, మహమ్మద్ షమీ, పుజార, మాజీ ఆటగాళ్లు వీరేందర్ సెహ్వాగ్​,  యువరాజ్, జహీర్​ ఖాన్​, దిగ్గజ స్ప్రింటన్ పీటీ ఉషా, యువ అథ్లెట్​ హిమదాస్​, రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగా​ట్​, దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​తో పాటు పలు క్రీడా విభాగాల్లోని అథ్లెట్లు పాల్గొన్నారు. స


logo