బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 03, 2020 , 12:50:33

ప్రముఖ క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

ప్రముఖ క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ: దేశంలోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా  క్రీడాకారులను మోదీ కోరారు. దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో  సాధారణ ప్రజలతో పాటు అన్ని రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఐతే కొంతమంది పౌరులు లాక్‌డౌన్‌ పాటించకుండా ఇండ్ల నుంచి బయటకు వస్తుండటంతో వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉంది. 

ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత,  వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజలను చైతన్య పరచాలని ప్రధాని వారిని కోరారు.  దేశంలో ప్రస్తుత పరిస్థితిని వివరించడంతోపాటు లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు ప్రతిఒక్కరు పాటించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో  భారత క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ,  సౌరభ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు, హిమదాస్‌ తదితరులు మోదీ మాట్లాడారు. 


logo