బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Oct 02, 2020 , 02:02:14

మహిళల సింగిల్స్‌లో ప్లిస్కోవా నిష్క్రమణ

మహిళల సింగిల్స్‌లో ప్లిస్కోవా నిష్క్రమణ

  • మూడో రౌండ్‌ చేరిన జొకో, సిట్సిపాస్‌ 

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మరో స్టార్‌ ప్లేయర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన చెక్‌ రిపబ్లిక్‌ తార కరోలినా ప్లిస్కోవా రెండో రౌండ్‌లో ఓడింది.గురువారం ఇక్కడ జరిగిన  మ్యాచ్‌లో ప్లిస్కోవా 4-6, 2-6 తేడాతో మాజీ చాంపియన్‌ జెలెనా ఓస్టపెంకో(లాత్వియా) చేతి లో వరుససెట్లలో ఖంగుతింది. గంటా 9 నిమిషా ల పాటు సాగిన మ్యాచ్‌లో ఓస్టపెంకో 27 విన్నర్లు సాధిస్తే.. ప్లిస్కోవా 9కే పరిమితమై నిరాశపరిచిం ది. 2017లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన ఓస్టపెంకో ఆ తర్వాత సరైన ప్రదర్శన చేయలేక  అన్‌సీడెడ్‌ స్థాయికి పడిపోయింది. కాగా ప్లిస్కోవా కవల సోదరి క్రిస్టినా 3-6, 2-6 తేడాతో 11వ సీడ్‌ ముగురుజ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ 3-6, 6-3, 6-2 తేడాతో  బోగ్డాన్‌పై గెలిచి మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. ఏడో సీడ్‌ పెట్రా క్విటోవా, సబలెంక  ముందంజ వేశారు. 

జొకో.. అడుతూ పాడుతూ..

పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ సునాయాసంగా మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో జొకో 6-1, 6-2, 6-2తేడాతో రిచర్జస్‌ బెరాకిన్స్‌ను గంటా 23 నిమిషాల్లోనే మట్టికరిపించి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 70వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ 6-1, 6-4, 6-2 తేడాతో పాబ్లో క్యువాస్‌(ఉరుగ్వే)పై గెలిచాడు. ఆరో సీడ్‌ అలెగ్జాండ్‌ జ్వెరెవ్‌, కరెనో బుస్టా, దిమిత్రోవ్‌, లెనార్డ్‌ స్టఫ్‌, కరెన్‌ కచనోవ్‌ కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్‌ శరణ్‌ తొలి రౌండ్‌లోనే నిష్కమించాడు. శరణ్‌, క్వాన్‌సూన్‌ వూ జోడీ 2-6, 6-4, 4-6 తేడాతో  స్కుగోర్‌, అస్టిన్‌  ద్వయం చేతిలో ఓడింది.   logo