మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 19, 2020 , 21:11:23

నాకు స్లోగా బౌలింగ్‌ చెయ్‌: బౌలర్‌కు అఫ్రిది వినతి

నాకు స్లోగా బౌలింగ్‌ చెయ్‌: బౌలర్‌కు అఫ్రిది వినతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది.. బౌలర్‌ హరిస్‌ రవూఫ్‌ను సరదాగా ఓ కోరిక కోరాడు. ఇక ఎప్పుడైనా తనకు బౌలింగ్‌ చేయాల్సి వస్తే స్లోగా బంతులు వేయాలని విన్నవించాడు. పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ బౌలర్‌ రవూఫ్‌ అద్భుతమైన ఫాస్ట్‌ యార్కర్‌తో ముల్తాన్‌ సుల్తాన్స్‌ తరఫున బరిలోకి దిగిన అఫ్రిదిని తొలి బంతికే బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత గౌరవంతో అఫ్రిదికి దండం పెట్టాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. అయితే తాజాగా తన ఔట్‌పై అఫ్రిది స్పందించాడు. రవూఫ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు. అది ఆడేందుకు సాధ్యం కాని గొప్ప యార్కర్‌. అద్బుతంగా బౌలింగ్‌ చేశావు రవూఫ్‌. తర్వాతిసారి నాకు కొంచెం స్లోగా బౌలింగ్‌ చెయ్‌. ఫైనల్స్‌కు వెళ్లిన ఖలందర్స్‌కు శుభాకాంక్షలు. మాకు మద్దతు తెలిపిన ముల్తాన్‌ సుల్తాన్స్‌ అభిమానులకు ధన్యవాదాలు అని అఫ్రిది ట్వీట్‌ చేశాడు.