శనివారం 06 మార్చి 2021
Sports - Jan 17, 2021 , 15:28:19

బెంగళూరు వదులుకునే ఆటగాళ్లు వీరే..!

బెంగళూరు వదులుకునే ఆటగాళ్లు వీరే..!

బెంగళూరు: ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ఇప్పటి వరకు ఒక్కసారి టైటిల్‌ గెలవలేకపోయింది. గత సీజన్‌లో ప్లేఆఫ్‌ చేరుకున్న కోహ్లీసేన ఎలిమినేటర్‌-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడిపోయింది. రాబోయే 2021 సీజన్‌లో ఎలాగైనా   కప్పు గెలవాలని ఆ ఫ్రాంఛైజీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్‌లో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది.

పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న ఆటగాళ్లను వదులుకోవాలని చూస్తున్నది. త్వరలో మినీ ఐపీఎల్‌ వేలం  నిర్వహించేనున్నారు.  జనవరి 21లోగా తమకు వద్దనుకున్న ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు విడుదల చేయాల్సి ఉంది.  వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం బెంగళూరు ఫ్రాంఛైజీ ఖాతాలో 6.5కోట్లు మాత్రమే ఉన్నాయి.  కొంతమంది ఆటగాళ్లను విడిచిపెట్టడం ద్వారా మరిన్ని నిధులను  జమ చేసుకోవాలని భావిస్తోంది. ఇందు కోసం ఇప్పటికే కనీసం ఐదుగురు ఆటగాళ్లను వదులుకోవడానికి బెంగళూరు సిద్ధమైనట్లు సమాచారం. 

1. ఉమేశ్‌ యాదవ్‌(రూ.4కోట్లు)

2.శివమ్‌ దూబే(రూ.5కోట్లు)

3.మొయిన్‌ అలీ(రూ.1.70కోట్లు-ఇంగ్లాండ్‌)

4.గుర్‌కీరత్‌ మన్‌(రూ.50లక్షలు)

5.పవన్‌ నేగీ(రూ.కోటి)

 

VIDEOS

logo