మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 20, 2021 , 15:34:06

క్వారంటైన్‌లో ప్లేయ‌ర్స్‌.. 4 కోట్ల డాల‌ర్ల ఖ‌ర్చు!

క్వారంటైన్‌లో ప్లేయ‌ర్స్‌.. 4 కోట్ల డాల‌ర్ల ఖ‌ర్చు!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ నిర్వ‌హించ‌డానికి టెన్నిస్ ఆస్ట్రేలియా భారీగానే ఖ‌ర్చు చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్లేయ‌ర్స్‌ను క్వారంటైన్‌లో ఉంచేందుకు ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతోంది. దీని కోసం 4 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చ‌వ‌నుండ‌గా.. ఆ మొత్తం తామే ఇస్తామ‌ని టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ క్రెయిగ్ టిలే చెప్పారు. గ‌తంలో ఈ మొత్తాన్ని విక్టోరియా ప్ర‌భుత్వం ఇస్తుంద‌ని పొర‌పాటుగా ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. బుధ‌వారం దీనికి సంబంధించి స్పష్ట‌త ఇచ్చారు. విదేశాల నుంచి వ‌చ్చిన ప్లేయ‌ర్స్ క్వారంటైన్ ఖ‌ర్చును ప్ర‌భుత్వం భ‌రిస్తే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని విక్టోరియా రాష్ట్ర మంత్రి లీసా నెవిల్ స్ప‌ష్టం చేశారు.  దీంతో ఆ ఖ‌ర్చు మొత్తం తామే భరిస్తామ‌ని టెన్నిస్ ఆస్ట్రేలియా తెలిపింది. 

VIDEOS

logo