మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 21, 2020 , 14:53:21

యూఏఈ బయలుదేరిన ధోనీసేన

యూఏఈ బయలుదేరిన ధోనీసేన

చెన్నై:  క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సందడి మొదలైంది.  ఐపీఎల్‌ -13వ సీజన్‌ కోసం ఆటగాళ్లు, సహాయ సిబ్బంది యూఏఈకి పయనమవుతున్నారు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు గురువారమే యూఏఈ చేరుకున్నారు.  తాజాగా  మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని  చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టు శుక్రవారం యూఏఈకి బయలుదేరింది. 

చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది తదితరులు యూఏఈకి పయనమయ్యారు.   టీమ్‌ సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మాత్రం జట్టుతో పాటు వెళ్లట్లేదు. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలోని  మూడు (దుబాయ్‌, అబుదాబి, షార్జా) వేదికల్లో ఐపీఎల్‌ జరుగనుంది.logo