శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 17, 2020 , 16:09:24

ఐపీఎల్‌ ఆటగాళ్లు ఇంటిముఖం

ఐపీఎల్‌ ఆటగాళ్లు ఇంటిముఖం

ఢిల్లీ: కరోనా వైరస్‌(కోవిడ్‌-19) మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్‌ ఏప్రిల్‌ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే.  దేశవ్యాప్తంగా జరగాల్సిన అన్ని క్రీడా ఈవెంట్లను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ రద్దు చేసింది. దేశవాళీ క్రికెట్‌ టోర్నీలు, ఇరానీ కప్‌, మహిళల ఛాలెంజర్‌ ట్రోఫీలను కూడా బీసీసీఐ వాయిదా వేసింది.  ఈనెల 21 నుంచి ప్రారంభం కావాల్సిన శిక్షణా శిబిరాన్ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలిపివేసింది.

చెన్నై, కోల్‌కతా, ముంబై  ఫ్రాంఛైజీలు శిక్షణ శిబిరాలు రద్దు చేయడంతో ఆయా ఫ్రాంఛైజీల ఆటగాళ్లు ఇంటిముఖం పట్టారు. ఐపీఎల్‌ ఎప్పుడు  మొదలయ్యేది స్పష్టత లేకపోవడంతో  ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహాలను నిలిపివేశాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌  ధోని కూడా   రాంచీకి బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన ఆటగాళ్లందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.  logo