శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 23:46:37

ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌.. యశస్వి జైస్వాల్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌.. యశస్వి జైస్వాల్‌

పోచెఫ్‌స్ట్రూమ్‌: దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్‌-19 పురుషుల క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. ఫైనల్లో హాట్‌ ఫేవరెట్‌ ఇండియాను ఓడించి, విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఇండియా.. తుది పోరులో చేతులెత్తేసింది. 5 సార్లు అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచి రికార్డు సృష్టిద్దామనుకున్న ఇండియాకు.. బంగ్లా ఝలక్‌ ఇచ్చింది. కాగా, ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్‌.. మ్యాన్‌ ఆఫ్‌ ది టీర్నీ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో యశస్వి.. 6 మ్యాచ్‌ల్లో 400 పరుగులు సాధించి, టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అందులో ఒక సెంచరీ సహా 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై రికార్డుస్థాయిలో సెంచరీ నమోదు చేశాడు. ఫైనల్లో 88 పరుగులు సాధించి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. బ్యాట్‌తోనే కాకుండా జైస్వాల్‌ బంతితోనూ రాణించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో వికెట్‌ సహా మొత్తం 3 వికెట్లు తీశాడు. 


logo