లండన్: న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట వర్షార్పణమైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకు ఆలౌట్ కాగా.. బదులుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 111/2తో నిలిచింది. ఈ దశలో శుక్రవారం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కొనసాగాల్సి ఉండగా.. భారీ వర్షం పడటంతో మ్యాచ్ వాయిదా పడింది.